‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’ : ముఖ్యమంత్రి కేసీఆర్

  • ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు
  • మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు
  • నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
  • మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం
  • మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు
  • నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు
  • నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం
  • ఎత్తిపోతల పథకాలకు రూ.2,500 కోట్లు కేటాయించాం
  • ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
  • ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను
  • త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
  • కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతా
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు హద్దు మీరితే.. తొక్కి పారేస్తాం
  • తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం
  • బీజేపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
  • ఆరేళ్లలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టాం
  • నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
  • కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నాం..
  • ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం
  • ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నాం
  • రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టాం.. రోజూ చర్చలు జరపాలి
  • 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశాం
  • దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు పెడతాం