ఏపీ ‘సీఎంఆర్‌ఎఫ్‌’కు లారస్‌ ల్యాబ్స్‌ రూ. 4 కోట్ల విరాళం

ఏపీ సీఎం సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ యాజమాన్యం రూ. 4 కోట్లు విరాళంగా అందజేసింది. సంస్థ ఉపాధ్యక్షుడు చావా నరసింహారావు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం పాఠశాలల అభివృద్ధికి సైతం ఆయన విరాళం అందజేశారు. పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇవే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లోనూ వసతులు కల్పిస్తామని నరసింహా రావు తెలిపారు.