జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయిరమణ బుధవారం రాత్రి హన్మకొండలో పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్టు పెట్రోలింగ్‌ సిబ్బంది గుర్తించి వెంటనే మ్యాక్స్‌కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అతడి వద్ద దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా చిట్యాల సీఐ సాయిరమణగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. సీఐ స్థాయి వ్యక్తి ఇలా ఆత్మహత్యకు యత్నించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.