కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ జీ రవి

సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ జీ రవి అధికారులను ఆదేశించారు. బుధవారం కోటి వృక్షార్చన కార్యక్రమంపై అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని నివేదికను అందజేయాలని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు బేతి రాజేశం, జల్ద అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీఆర్డీఏ లక్ష్మీనారాయణ, ఎంపీవోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.