ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకలో ఐదో నెంబరు మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అరకు ఘాట్రోడ్డులో టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు సంఘటనా స్థలంలో మృతిచెందారు. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో పలువురు హైదరాబాద్వాసులుగా గుర్తింపు.
లోయలో పడిన ప్రైవేటు టూరిస్ట్ బస్సు(దినేష్ ట్రావెల్స్ బస్సు టీఎస్ 09యూడీ 5729) శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి అరకు చేరుకుంది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డులో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను విజయనగరం జిల్లాలోని ఎస్ కోట ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కంట్రోల్ రూం నెంబర్లు 08912590102;0891259010.