కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన సమయంలో స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలతో శబరిగిరులు మార్మోగాయి. భక్తుల అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.