ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంకు తరలించారు. వైద్యులు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
