మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌ రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మంత్రి తల్లిగారిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.