ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఈసీ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు.
ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు: విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం