కోటి వృక్షార్చనలో మొక్కలు నాటుదాం : చిరంజీవి

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు కానుకగా ఇద్దామని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. దాని కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుదామన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.