హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఈనెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు.
