రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ఆయన విశాఖకు వెళ్లి శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులను కలుస్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష టీడీపీతోపాటు విశాఖ కార్మికులు ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  సీఎం జగన్‌ విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, జేఏసీ నేతలతో ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.