కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్క‌లు నాటిన మంత్రి కేటీఆర్

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతమైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పాటు హ‌రిత ప్రేమికులు పాల్గొని మొక్క‌లు నాటారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కూడా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. కేటీఆర్ భార్య శైలిమ‌, కూతురు అలేఖ్య ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.