తెలంగాణ డిజిటల్‌ మీడియాకు పీఆర్‌ఎస్‌ఐ అవార్డు

  • కేంద్రం నుంచి అవార్డు అందుకున్న డిజిటల్‌ మీడి యా డైరెక్టర్‌ దీలిప్‌ కొణతం

తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. 2020 సంవత్సరానికి పబ్లిక్‌ రిలేషన్స్‌ సోసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) వారి కమ్యూనికేషన్స్‌ క్యాంపెయిన్‌ ఆఫ్‌ ది ఇయర్‌  కొవిడ్‌ 19 అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డును కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య వర్చువల్‌ విధానంలో డిజిటల్‌ మీడి యా డైరెక్టర్‌ దీలిప్‌ కొణతంకు అందించారు. కరోనా సమయం లో సరైన సమచారాన్ని తెలుసుకోవడానికి వాట్సాప్‌తో కలిసి చాట్‌బూట్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూలో సమాచారం అందించారు. తెలంగాణ మాత్రమే ఈ తరహా సమాచారాన్ని అందించడానికి వాట్సాప్‌ చాట్‌బూట్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో మూడు లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. కరోనా సమయంలో పలు విషయాలపై తప్పుడు సమాచారం ప్రచారమైంది. దీంతో నిజమైన సమాచారం ఏదో తెలుసుకోవడానికి తెలంగాణ ఫ్యాక్ట్‌ చెక్‌ పోర్టల్‌ కూడా ఏర్పాటు చేశారు. దీనిని కూడా మూడు భాషల్లో అందుబాటులో ఉంచగా.. ఐదు లక్షల మంది యూజర్లు ఈ పోర్టల్‌ ద్వారా వాస్తవాలు తెలుసుకున్నారు. ఈ విధంగా తెలంగాణ ఐటీశాఖ వీటిని ఏర్పాటుచేసి కరోనా సమయంలో ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేందుకు చొరవ చూపింది.