దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ (సఫర్) తెలిపింది. చాలా ప్రాంతాల్లో 270కిపైగా ఏక్యూఐ నమోదైందని పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ 0-50 మధ్య నమోదైతే స్వచ్ఛమైందిగా, 51-100 సంతృప్తికరమైన, 101-2001 మితమైందిగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా తెలిపింది. ఉపరితల గాలులు తక్కువగా ఉన్నాయని, పగటిపూట కాస్త మెరుగుపడుతుందని అంచనా వేసింది. శుక్రవారం కాలుష్యం మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఆస్తమా రోగులు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ గాలి నాణ్యత సూచి క్షీణించింది.
