గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల రైడ్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఫ‌ల‌క్‌నుమా ప‌రిధిలో గ‌ల వాట్టేప‌ల్లిలోని గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆక‌స్మికంగా రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున గ‌న్‌పౌడ‌ర్‌ను, డిటోనేట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ష‌బ్బీర్ అనే ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. త‌యారు చేసిన గ‌న్‌పౌడ‌ర్‌ను క‌రీంన‌గ‌ర్‌కు ర‌వాణా చేస్తున్నారు. అదేవిధంగా డిటోనేట‌ర్లు త‌యారు చేసేందుకు గ‌న్‌పౌడ‌ర్‌ను వినియోగిస్తున్న‌ట్లు స‌మాచారం. అమొనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్‌ల మిశ్ర‌మంతో నిందితుడు గన్ పౌడ‌ర్‌ను త‌యారు చేస్తున్నాడు.

త‌దుప‌రి విచారణ నిమిత్తం నిందితుడు ష‌బ్బీర్‌ను ఫ‌ల‌క్‌నుమా పోలీసుల‌కు అప్ప‌గించారు. 2018లో లైసెన్స్ పొంది గన్ పౌడర్‌ను తయారు చేస్తున్న షబ్బీర్ క్ర‌మంగా అక్రమంగా డిటోనేటర్‌లు త‌యారు చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాలిష్ పౌడ‌ర్‌గా చూయించి త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించి గ‌న్‌పౌడ‌ర్‌ను 25 కాట‌న్ బాక్సుల్లో క‌రీంన‌గ‌ర్‌కు ర‌వాణా చేస్తున్నాడు.