నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన నిర్మల్‌ ఎంపీవో

నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వెంచర్‌ యజమాని నుంచి రూ. 2. 70 లక్షల లంచం తీసుకుంటున్న నిర్మల్‌ ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, అనంతపేట్‌ గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచ్‌ భర్త నేరేళ్ల అశోక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంచర్‌ మార్ట్‌గేజ్‌ విషయంలో వీరు రూ. 5 లక్షలు డిమాండ్‌ చేయగా, ఆఖరికి రూ. 2. 70 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడి సమాచారంతో, ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.