సిటీ సివిల్‌ కోర్టు అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మద్దికుంట లింగం

సిటీ సివిల్‌ కోర్టు అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది మద్దికుంట లింగం నారాయణ ఎన్నికయ్యారు. మార్చి 5న (శుక్రవారం) హొరా హోరిగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అత్యధికంగా 535 ఓట్లు సాధించి ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షులుగా ఎన్‌. నాగభూషణం, జి. శ్రీలత ఎన్నికయ్యారు.  కార్యదర్శిగా ఈ. కిశోర్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా ఎం. మురళీ మోహన్‌ గెలిచారు.