“ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ చెరువు కట్ట ప్రాంతాల్లో వ్యర్థాలను, ప్లాస్టిక్ ను తొలగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బి నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతు విధిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న యువతి, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి సరూర్ నగర్ చెరువులో ప్లాస్టిక్ మరియు వ్యర్థాలను తొలగించారు. ప్రజలు కూడా తమ వంతుగా తడిచెత్త మరియు పొడిచెత్తను వేరుచేసి ఇంటికి వచ్చే చెత్త ఆటో రిక్షా వారికి ఇవ్వాలని అన్నారు. అలాగే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెరువు నందు వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ లాంటివి వేయడం వల్ల చెరువు నీరు కలుషితమవుతున్నాయని అని అన్నారు. అలాగే ప్రజలకు స్వచ్ఛతపై అవగహన కల్పిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, తమ వంతు సహాయ సహకారాలు అందివాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.