గుత్తా సుఖేందర్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.