తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హారిక

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్రమంలో పాల్గొని అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ముద్దుగుమ్మ హ‌రిక‌. తాజాగా హారిక‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. సొంత‌ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమ‌స్ అయిన ఈ అమ్మ‌డు దేత్త‌డి హారిక‌గా మారి ఇప్పుడు తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక కావ‌డం గొప్ప విశేషం.