అవినీతి అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా బంగారం, న‌గ‌దు స్వాధీనం!

క‌ర్ణాట‌క‌లో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చాముండేశ్వ‌రి ఎల‌క్ట్రిసిటీ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కేఎం మునిగోపాల్ రాజు భారీగా అక్ర‌మాస్తులు కూడ‌గ‌ట్టాడ‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. మంగ‌ళ‌వారం యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో (ఏసీబీ) అధికారులు మైసూరులోని అత‌ని ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో భారీగా న‌గ‌దు, విలువైన ఆభ‌ర‌ణాలు, ఖ‌రీదైన గ‌డియారాలు, బంగారు పాత్ర‌లు ప‌ట్టుబ‌డ్డాయి. అధికారులు వాటన్నింటిని స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.