సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని, దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో  ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సమావేశం అనంతరం స్వామి మాట్లాడుతూ..స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ చర్చలు జరుపుతారని భావిస్తున్నట్లు  చెప్పారు.