గవర్నర్‌, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న ప్రజలకు ఎల్లవేళలా శివుడి ఆశీర్వాదం ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.మహాశివుని అనుగ్రహం కోసం పూజలుచేసే శివరాత్రి అత్యంత పవిత్రమైనదని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.