కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని, వైద్యుల సూచ‌న మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. గ‌త కొద్ది రోజుల నుంచి త‌న‌ను క‌లిసిన వారంతా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కొవిడ్ టెస్టు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.