సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్. ఛాలెంజ్ కు స్పందించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి…
సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి లకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి.
గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం..ఎంపీ సంతోష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం గొప్ప సామాజిక చైతన్యానికి,మార్పుకు దోహదం చేస్తున్నది. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నది. తెలంగాణ త్వరలోనే హరిత తెలంగాణ గా మారుతుంది.
గ్రీన్ ఛాలెంజ్ ద్వారా సిద్ధిపేట జిల్లాలో మరిన్ని మొక్కలను నాటుతాం, ప్రజల్లో మరింత చైతన్యం తెస్తాం. గ్రీన్ ఛాలెంజ్ ప్రక్రియ కు దేశవ్యాప్తంగా స్పందన వస్తున్నది. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలో ఒక భాగస్వామ్యం అయ్యింది.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి మమ్మల్ని భాసగస్వాములను చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు.