ఏపీలో కొత్తగా 585 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా రోజు రోజుకూ విస్తరిస్తున్నది. వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి.

251 మంది చికిత్సకు కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,95,121కు చేరింది.

8,84,978 చికిత్సకు కోలుకున్నారు.. మరో 2946 యాక్టివ్‌ కేసులున్నాయి. 7,197 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 35,066 శాంపిళ్లను పరీక్షించారు.