నిరుద్యోగ భృతి త‌ప్ప‌క ఇస్తాం : ‌సీఎం కేసీఆర్

 నిరుద్యోగ భృతి ఇవ్వాల‌న్న సంక‌ల్పం ఉంది. త‌ప్ప‌కుండా ఇచ్చి తీరుతామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా నిరుద్యోగ భృతి ‌పై సీఎం మాట్లాడారు.

క‌రోనా కార‌ణంగా నిరుద్యోగ భృతి ఇవ్వ‌లేక‌పోయామ‌ని చెప్పారు. నిరుద్యోగుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఇతర రాష్ర్టాల్లో నిరుద్యోగ భృతి అమ‌ల‌వుతున్న తీరును ప‌రిశీలిస్తున్నాం. క‌రోనా కొలిక్కి వ‌చ్చాక నిరుద్యోగ భృతి త‌ప్ప‌క ఇస్తామ‌న్నారు. విద్యారంగ నిధులు పెంచే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.