తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ ముగిసిన అనంత‌రం దానికి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన స‌మావేశాలు తొమ్మిది రోజుల పాటు కొన‌సాగాయి. 18న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

15న ప్రారంభ‌మైన అసెంబ్లీ 47 గంట‌ల 44 నిమిషాల పాటు కొన‌సాగాయి. ఈ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల తాత్కాలిక మూసివేత‌పై ప్ర‌క‌ట‌న చేశారు. 75 మంది స‌భ్యులు ప్ర‌సంగించారు. శాస‌న‌స‌భ‌లో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.