తెలంగాణలో కొత్తగా 495 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 495 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 1,870 బాధితులు కోలుకున్నారని తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 58,029 టెస్టులు చేసినట్లు వివరించింది.