బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళి

అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు.