ఏపీలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1005 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

324 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,98,815కు చేరింది. 8,86,216 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 5394 యాక్టివ్‌ కేసులున్నాయి. నేటివరకు 7205 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 31,142 శాంపిళ్లను పరీక్షించారు.