యాచారం మండలం మర్రిగూడలో కానిస్టేబుల్ సైదులు ‌ ఆత్మహత్య

యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

అయితే, సైదులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 2018 బ్యాచ్‌కు చెందిన సైదులు స్వగ్రామం నల్గొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్. మృతుడికి ఇటీవల పెళ్లి కాగా.. ప్రస్తుతం భార్య గర్భిణి. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.