సీఎం జగన్‌ను కలిసిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

గుంటూర్‌ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటికే నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేసిన సంగతి విదితమే.

ఎస్‌ఈసీగా నియామకమైన నేపథ్యంలో ఇటీవలే ఆమె సీఎం ముఖ్యసలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన తర్వాత ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.అయితే ఈ పదవిలో సాహ్ని రెండేళ్ల పాటు ఉండేవారు.

అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఏపీ ఎస్‌ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.