ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై సీఎం కేసీఆర్ హ‌ర్షం

త‌మిళ సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల‌ సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా ద‌శాబ్దాల పాటు త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక శైలిని చాటుకుంటూ, నేటికి దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ అన్నారు.