భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ర‌జ‌నీకాంత్ థ్యాంక్స్‌

ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు త‌న‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జ్యూరీకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. త‌న ట్విట‌ర్ హ్యాండిల్ ద్వారా ర‌జ‌నీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. త‌న కెరీర్ మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచిన స్నేహితుడు రాజ్ బ‌హ‌దూర్‌, త‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ రావు గైక్వాడ్‌కు కూడా ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేర‌కు ర‌జ‌నీ మొత్తం మూడు ట్వీట్లు చేశాడు. త‌న‌కు అభినంద‌న‌లు చెబుతూ ప్ర‌ధాని మోదీ చేసిన ట్వీట్‌కు థ్యాంక్స్ చెప్పిన ర‌జనీ.. మ‌రో ట్వీట్‌లో త‌మిళంలో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. త‌న గురువు కే బాల‌చంద‌ర్‌ను ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ గుర్తు చేసుకున్నాడు. సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్‌, స్నేహితుడు క‌మ‌ల్ హాస‌న్‌ల‌కు కూడా ర‌జ‌నీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు.