టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి  ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్‌ చేశారు. వారిని రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌ కుమార్‌గా గుర్తించారు. సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు.

సీబీఐ సోదాలపై ఎంపీ మాలోతు కవిత స్పందించారు. దుర్గేష్‌కుమార్‌ తమ డ్రైవర్ అని, నా నివాసంలోని స్టాఫ్‌ క్వార్టర్స్‌ అతనికి ఇచ్చానని పేర్కొన్నారు. మిగిలిన వారిద్దరూ ఎవరో తనకు తెలియదన్నారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని.. పట్టుబడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.‌