
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ సెంచరీ(128 బంతుల్లో 119: 8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి(91 బంతుల్లో 89: 8 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్ లో అత్యధిక పరుగులతో రాణించిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.