సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌ రెడ్డి కన్నుమూత

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

పెద్దవూర సర్పంచ్‌గా విజయభాస్కర్‌ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది.. 12 వార్డులను ఏకపక్షంగా గెలుచుకొని రికార్డు సృష్టించారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి సహకారంతో పెద్దవూర మండల కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారు.

గతంలో పలు ప్రధాన దినపత్రికల్లో విలేకరిగానూ ఆయన పనిచేశారు. జర్నలిస్టుగా, ప్రజానాయకుడిగా విజయభాస్కర్ రెడ్డి అందరి మన్ననలు పొందారు.

విజయ భాస్కర్ రెడ్డి మృతి పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.