తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇందులో 3,02,768 మంది కోలుకోగా, 1723 మంది మృతిచెందారు. మరో 8746 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 4458 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డిలో 116, నిజామాబాద్‌ 77, సంగారెడ్డిలో 52, నిర్మల్‌లో 42, జగిత్యాలలో 32, కరీంనగర్‌లో 38, కామారెడ్డిలో 28 చొప్పున నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,35,997 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 43,070 మందికి పరీక్షలు చేశామని తెలిపింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 14,74,136 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.