ఈనెల 9న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 9న సమావేశం కానుంది. హైదరాబాద్‌లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా వేసవి నీటి అవసరాలతో పాటు గడిచిన మూడు నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి 14 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు తెలుస్తున్నది. గతంలో ఫిబ్రవరి 5న కృష్ణాబోర్డు సమావేశం జరిగింది.