ఏసీబీ వలలో బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్

ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి ఉప్పల్ వాటర్ బోర్డ్‌లో బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు.. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.