మాస్క్ ‌ధరించక పోతే రూ.1000 జరిమానా

కోవిడ్‌-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి  పబ్లిక్‌ ప్లేస్‌లోనూ, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. మాస్క్‌ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానాతో పాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌యాక్ట్‌-2005, ఐపీసీ సెక్షన్‌ 188,  51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త జీవోను అమలు చేసేందుకు జిల్లాకలెక్టర్లు, పోలీసు అధికారులకు అవసరమైన అధికారాలను ఇచ్చింది.