
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ) రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపవర్ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి, రైతులకు ఇవ్వాలని ఏపీ మంత్రి వర్గం నిర్ణయించింది. ఏఎంఆర్డీఏ ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమెదం తెలిపింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ జరించాలని ఏపీ మంత్రి వర్గం నిర్ణయించింది. రైతులకు 15 ఏళ్ల పాటు కౌలు చెల్లించేందుకు, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటును మంత్రి వర్గం ఆమోదించింది.