ఈ నెల 7న వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవ సమావేశం

ఈ నెల 17న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఉప కులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు తెలిపా రు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో శనివారం జరుగనుందన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్‌ సభ్యులు ప్రొ॥ రమేష్‌ చంద్‌, వర్సిటీ చాన్సలర్‌, రాష్ట్ర గౌవర్నర్‌ డా॥ తమిళి సై సౌందర్‌ రాజన్‌ అధ్యక్షత వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు స్నాతకోత్సవం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లోనే డిగ్రీ ప్రదానం..

ఈ స్నాతకోత్సం సందర్భంగా ప్రొఫెసర్‌ రాంచంద్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రదానం చేయనున్నారు. ఒకే సా రి ఆన్‌లైన్‌లో 21 పీహెచ్‌డీ విద్యార్థులు, 148 ఎమ్మెస్సీ విద్యార్థులు, 517 ఎంజీ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేయనున్నారు. దేశంలోనే ఇలా ఆన్‌లైన్‌లో డిగ్రీలు అందజేయడం తొలిసారి. ఈ అ కాడమిక్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 పీజీ 19 అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరించనున్నారు. పూర్తి కొవిడ్‌ నిబంధనల నడుమ స్నాత కోత్సవం నిర్వహించనున్నారు.