సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్ వ‌ల్లే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌. అనేక ఉన్న‌త ప‌ద‌వుల్లో ఆయ‌న ప‌నిచేశారు. సీబీఐ డైర‌క్ట‌ర్‌గా, ఐటీబీపీ డీజీగా చేశారు. ఇవాళ ఉద‌యం 4.30 గంట‌ల‌కు ఢిల్లీలో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.