నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
