అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని అన్నారు. బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అనుమానితులపై నిరంతరం నిఘా పెడుతున్నామని డీజీపీ చెప్పారు.