తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 4009 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. శ‌నివారం 5 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, ఆదివారం ఆ సంఖ్య 4 వేల‌కు త‌గ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1878 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 14 మంది వైర‌స్ వ‌ల్ల‌ మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 3.55 ల‌క్ష‌ల‌కు చేరాయి. ఇందులో 1838 మంది మ‌ర‌ణించ‌గా, 3.14 ల‌క్ష‌ల మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 705 ఉండ‌గా, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 363, నిజామాబాద్‌లో 360, రంగారెడ్డిలో 336, సంగారెడ్డిలో 264 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 83,089 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.