తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్‌

కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల సమావేశం జరిగింది. వకీల్‌ సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు.

కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు.